దేశంలో నిన్న 3,741 మంది కరోనాతో మృతి
- కొత్తగా 2,40,842 మందికి కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,30,132
- మృతుల సంఖ్య మొత్తం 2,99,266
- 19,50,04,184 మందికి వ్యాక్సిన్లు
దేశంలో గడచిన 24 గంటల సమయంలో కొత్తగా 2,40,842 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,55,102 మంది కోలుకున్నారు.
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,30,132కు చేరింది. మరో 3,741 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,99,266కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,34,25,467 మంది కోలుకున్నారు. 28,05,399 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,50,04,184 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,86,07,937 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 21,23,782 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.