ఈ-పాస్ లేని వాహనాలను వెనక్కి పంపుతోన్న తెలంగాణ పోలీసులు
- లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం
- ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద తనిఖీలు
- మరోసారి ఇలాగే వస్తే వాహనం సీజ్ చేస్తామంటున్న పోలీసులు
తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్ ఆంక్షలను కఠినతరం చేయడంతో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద కట్టుదిట్టంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా తెలంగాణ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణలోకి ఈపాస్ లేకుండా వస్తోన్న వారిని వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి ఈ పాస్ లేకుండా వస్తే వాహనం సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా, తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించే పరిస్థితి రానివ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు.