ఆ ముగ్గురిలో సీబీఐ నూతన డైరెక్టర్ ఎవరయ్యేనో..!

  • ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత సమావేశం
  • హాజరైన విపక్షనేత అధిర్ రంజన్, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
  • 100 పేర్లను పరిశీలించిన కమిటీ
  • ముగ్గురితో తుది జాబితా
  • ముగ్గురిలో ఒకరికి సీబీఐ అత్యున్నత పదవి
సీబీఐ నూతన డైరెక్టర్ ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన, పార్లమెంటులో విపక్షనేత అధిర్ రంజన్ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికకు కసరత్తులు చేస్తోంది. 1984-87 బ్యాచ్ లకు చెందిన 100 మంది పేర్లను పరిశీలించి, అనేక వడపోతల పిదప ముగ్గురితో తుది జాబితా రూపొందించింది.

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ (డిజి) సుబోధ్ కుమార్ జైస్వాల్, సశస్త్ర సీమాబల్ డీజీ కేఆర్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన.. హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత విభాగం) వీఎస్కే కౌముది  సీబీఐ కొత్త చీఫ్ రేసులో మిగిలారు. వీరిలో ఒకరిని సీబీఐ అత్యున్నత పదవికి ఎంపిక చేయనున్నారు.


More Telugu News