లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 380 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 93 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతం వరకు లాభపడిన బజాజ్ ఫిన్ సర్వ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫైనాన్స్ స్టాకుల కొనుగోళ్లకు మదుపుదారులు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడి 51,017కి చేరుకుంది. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 15,301 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (4.82%), బజాజ్ ఫైనాన్స్ (2.72%), ఇన్ఫోసిస్ (2.60%), మారుతి సుజుకి (1.72%), ఎల్ అండ్ టీ (1.52%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-3.11%), ఎన్టీపీసీ (-1.77%), ఓఎన్జీసీ (-1.18%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.56%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.41%).