ఊగిసలాటల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 98 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 36 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- నేటితో ముగిసిన మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. లాభాల్లోకి వెళ్తూ, నష్టాల్లోకి జారుతూ చివరి వరకు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి.
మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడువు ఈరోజుతో ముగియడం కూడా ఈ కుదుపులకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 51,115కి చేరింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 15,338 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.84%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.16%), యాక్సిస్ బ్యాంక్ (2.07%), బజాజ్ ఆటో (1.92%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.52%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.38%), బజాజ్ ఫైనాన్స్ (-1.53%), ఓఎన్జీసీ (-1.28%), మారుతి సుజుకి (-0.91%), ఎన్టీపీసీ (-0.85%).