హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులే: గోవిందానంద సరస్వతి

  • హనుమంతుడి జన్మస్థలంపై వివాదం
  • ఎటూ తేలని టీటీడీ, హనుమద్ జన్మభూమి ట్రస్టు చర్చలు
  • టీటీడీ తీరుపై గోవిందానంద విమర్శలు
  • అవగాహన లేకుండా ప్రకటించారని వ్యాఖ్యలు
  • 'వేంకటాచల మహత్మ్యం' ఓ తప్పుల తడక అని వెల్లడి
శ్రీరామబంటు హనుమంతుడి జన్మస్థానం తిరుమల గిరులేనని టీటీడీ నిర్ధారించడంపై హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ గోవిందానంద సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ తీసుకువచ్చిన పుస్తకంలో అన్నీ తప్పులేనని విమర్శించారు. సంపూర్ణ అవగాహన లేకుండా, పరిశోధన చేయకుండానే అసంపూర్ణ జ్ఞానంతో హనుమంతుడి జన్మస్థలాన్ని ప్రకటించారని ఆరోపించారు.

హనుమంతుడి జన్మస్థలానికి ప్రామాణికంగా చూపుతున్న 'వేంకటాచల మహత్మ్యం' సంకలనం ఓ తప్పుల తడక అని అభివర్ణించారు. అది బుర్ర లేని వారు రాసిన పుస్తకం అని గోవిందానంద అన్నారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవడంలేదని ఆయన విమర్శించారు.

త్రేతాయుగంలో తిరుమల పర్వతానికి అంజనాద్రి అని పేరు ఉందని, హనుమంతుడు వెంకటగిరిలో తపస్సు చేసినట్టు రాయడం తప్పు అని పేర్కొన్నారు. హనుమంతుడు కలియుగంలో పుట్టినట్టు టీటీడీ పుస్తకం చెబుతోందని గోవిందానంద తెలిపారు. టీటీడీ చెబుతున్న దాని ప్రకారం హనుమంతుడు ఓ రాక్షసుడు అని, కానీ రామాయణం ప్రకారం ఓ అప్సరస కుమారుడు అని వివరించారు.


More Telugu News