ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్ట్ .. 'హనుమాన్'
- 'అ' చిత్రం ఒక ప్రయోగం
- 'జాంబిరెడ్డి'తో సక్సెస్
- కొత్త జోనర్లో మరో సాహసం
యువ దర్శకులలో తనదైన ముద్ర చూపించడానికి ప్రశాంత్ వర్మ చాలా తపన పడుతుంటాడు. అందులో భాగంగానే ఆయన వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. 'అ' .. 'కల్కి' .. 'జాంబి రెడ్డి' సినిమాలను పరిశీలిస్తే, ఒక జోనర్ కు మరో జోనర్ సంబంధం లేని కథలను ఆయన ఎంచుకుంటూ ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ సారి కూడా ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతూ మరో కొత్త జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. ఆయన తాజా ఎనౌన్స్ మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ రోజున ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా తన నుంచి కొత్త అప్డేట్ ఉంటుందని ఆయన నిన్ననే చెప్పాడు. చెప్పినట్టుగానే కొంత సేపటిక్రితం ఆయన ఒక వీడియో వదిలాడు. తన తాజా చిత్రం 'హనుమాన్' అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. అయితే కథ .. కాన్సెప్ట్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. టైటిల్ ను బట్టి చూస్తుంటే హనుమంతుడి అంశతో జన్మించినవారో .. అనుగ్రహం పొందినవారో చేసే విన్యాసాలకు సంబంధించినదిగా అనిపిస్తోంది. బహుశా ఇది పిల్లలను ఆకట్టుకునే కేటగిరీలోకి వస్తుందేమో చూడాలి.