'పృథ్వీరాజ్' సినిమా పేరుపై శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరం

  • పేరు మార్చాలని డిమాండ్
  • లేకుంటే నిరసనలు చేపడతామని హెచ్చరిక
  • పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పతనానికి తగ్గట్టుగా ఉండాలని సూచన
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమా పేరుపై శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా పేరును మార్చాల్సిందేనని డిమాండ్ చేసింది. సినిమాకు ‘పృథ్వీరాజ్’ అని మాత్రమే పేరు పెట్టడం తగదని, అది ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అవుతుందని కర్ణిసేన పేర్కొంది.

హిందూ చక్రవర్తులలో చివరివాడైన పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పతనం ప్రతిబింబించేలా సినిమా పేరు ఉండాలని, అలా కాకుండా ‘పృథ్వీరాజ్’ అని మాత్రమే పేరు పెట్టడం సరికాదని ఆ సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా అన్నారు. పేరు మార్చకుంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గతంలో ‘పద్మావత్’ సినిమా పేరుపైనా ఈ సంస్థ ఆందోళనకు దిగింది.


More Telugu News