తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్ష‌లు

  • తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
  • 'ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయం తెలంగాణ' అన్న ఉపరాష్ట్రపతి 
  • ప్ర‌జ‌ల ఆరోగ్యం, శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్నానన్న ప్రధాని   
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగానే జ‌రుగుతున్నాయి. కొవిడ్ విజృంభ‌ణ‌ వేళ నిబంధనలను పాటిస్తూ  ఉత్సవాలు జరపాలని తెలంగాణ‌ ప్రభుత్వం నిర్ణయించడంతో నేత‌లు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, ప‌లు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణకు మాత్రమే పరిమితం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

'తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ ఉపరాష్ట్రపతి వెంక‌య్య నాయుడు ట్వీట్ చేశారు.

'రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ‌దైన‌ సంస్కృతితో, క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వంతో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆరోగ్యం, శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్నాను' అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.


More Telugu News