కరోనాను పొమ్మంటూ... రోడ్లపైకి వచ్చి దెయ్యాల నృత్యం చేసిన వెనిజులా ప్రజలు

  • వెనిజులాలో వింత ఆచారం
  • నజరీన్ నిర్వహించిన గ్వాజిరా ప్రాంత వాసులు
  • సుదీర్ఘకాలం కిందట ఆఫ్రికా నుంచి వలస
  • కేథలిక్ సంప్రదాయం ప్రకారం వేడుకలు
వెనిజులాలోని గ్వాజిరా ప్రాంతంలో నివసించే ఓ తెగ ప్రజలు ప్రతి ఏడాది నజరీన్ పేరుతో వేడుకలు జరుపుకుంటారు. ఈ నృత్య వేడుకలకు యునెస్కో గుర్తింపు కూడా ఉంది. వీరి పూర్వీకులు ఆఫ్రికా నుంచి వలసవచ్చారు. వీరు కేథలిక్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. కాగా, నజరీన్ వేడుకలో భాగంగా వారు వివిధ వేషధారణలతో రోడ్లపైకి వచ్చి దెయ్యాల డ్యాన్స్ చేస్తుంటారు.

ఈ ఏడాది కూడా గ్వాజిరా సముద్ర తీరప్రాంత పట్టణాల్లో ఈ వేడుకలు జరిపారు. అయితే ఈసారి కరోనాను పారదోలేందుకు దెయ్యాల డ్యాన్స్ చేశారు. చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని వీరు ప్రతి ఏటా నజరీన్ నిర్వహిస్తుంటారు. ఈసారి కరోనాపై మానవాళి గెలవాలన్న సదుద్దేశంతో ఈ తెగ ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేశారు.


More Telugu News