కొవిడ్ రిపోర్టు లేకున్నా ‘ఎగరొచ్చు’.. కేంద్రం యోచన

  • టీకా రెండు డోసులు వేయించుకుని కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ప్రయాణానికి అర్హత
  • నిబంధనను ఎత్తివేసే యోచనలో కేంద్రం
  • రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు
దేశీయ విమాన ప్రయాణాల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సడలించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కొవిడ్ టీకా రెండు డోసులు వేసుకున్న వారు ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉంటేనే విమాన ప్రయాణానికి అర్హులు. చాలా రాష్ట్రాలు దీనిని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో ఈ నిబంధనను ఎత్తివేయాలని కేంద్రం యోచిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కొవిడ్ నెగటివ్ రిపోర్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫలితంగా దేశీయ విమానయాన రంగాన్ని పట్టాలెక్కించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి పౌర విమానయాన శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతున్నారు. ఇదే విషయంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోనూ కేంద్రం చర్చలు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


More Telugu News