మహిళ వేషంలో వచ్చి.. అత్యాచార బాధితురాలిని హత్య చేసిన నిందితుడు!
- పొరుగింటి మహిళపై అత్యాచారం
- గతేడాది ఘటన
- నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- బెయిల్ పై బయటికొచ్చిన వ్యక్తి
- కేసు వెనక్కి తీసుకోనందుకు ఘాతుకం
రాజస్థాన్ లో దారుణం జరిగింది. అత్యాచారానికి గురైన బాధితురాలిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హత్య చేశాడు. అది కూడా ఓ మహిళ వేషంలో వచ్చి ఆమె ప్రాణాలు తీశాడు. కేసును వెనక్కి తీసుకోనందుకు ఆమెపై కక్ష పూనిన నేత్రమ్ అనే వ్యక్తి ఇద్దరు పిల్లల తల్లయిన ఆమెను అంతమొందించాడు.
సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్, బాధిత మహిళ ఇరుగుపొరుగు వారే. అయితే నేత్రమ్ గతేడాది ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నేత్రమ్ ను అరెస్ట్ చేశారు. కొంతకాలం కిందటే అతడు బెయిల్ పై బయటికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
బాధితురాలు ఓ వితంతువు. ఇద్దరు పిల్లలు, చెల్లెలుతో కలిసి నివసిస్తోంది. గత రాత్రి ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ మహిళ వేషంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన నేత్రమ్... నిద్రిస్తున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు. అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన బాధితురాలు మరణించింది. పోలీసులు నేత్రమ్ కోసం తీవ్రంగా గాలించి, సోమవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు.