నేడు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 271 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 101 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఒకటిన్నర శాతానికిపైగా నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ కంపెనీలు నష్టాల బారిన పడటం మార్కెట్లపై ప్రభావం చూపింది.  ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 52,501కి పడిపోయింది. నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 15,767కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (1.66%), ఎన్టీపీసీ (1.61%), ఓఎన్జీసీ (1.04%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.77%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.75%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.18%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.69%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.26%), బజాజ్ ఫైనాన్స్ (-1.15%), భారతి ఎయిర్ టెల్ (-1.13%).

మరోవైపు ఐపీఓకు వచ్చిన కిమ్స్ హాస్పిటల్స్, దొడ్ల డెయిరీల షేర్లను ఎక్చేంజీలలో ఈ రోజు లిస్ట్ చేయడంతో వాటి ట్రేడింగ్ ప్రారంభమైంది.


More Telugu News