'ఐకాన్' స్క్రిప్ట్ కి పాన్ ఇండియా మెరుగులు!
- షూటింగు దశలో 'పుష్ప'
- 'ఐకాన్' ప్రాజెక్టుకు సన్నాహాలు
- పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్
- స్క్రిప్ట్ పై సాగుతున్న కసరత్తు
దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' ఉంటుందా? ఉండదా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ సినిమా ఉంటుందని ఇటీవల నిర్మాత బన్నీ వాసు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. 'పుష్ప' మొదటిభాగానికీ .. రెండవ భాగానికి మధ్యలో 'ఐకాన్' పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టం చేశాడు. దాంతో ఈ సినిమా విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. 'వకీల్ సాబ్' సినిమా చూసిన అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ టేకింగ్ నచ్చడం వల్లనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
అయితే ముందుగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదల చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు - వేణు శ్రీరామ్ ఉన్నారట. కానీ ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారట. అందువలన పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తారన్న మాట. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల పేర్లు త్వరలోనే వెల్లడించనున్నారు.