మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్ సత్య నాదెళ్లకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు
- మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్ గా సత్య నాదెళ్ల
- ఇప్పటివరకు సీఈవోగా వ్యవహరించిన వైనం
- గర్వించదగ్గ విషయమన్న చంద్రబాబు, లోకేశ్
- ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్య
ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇప్పటివరకు సీఈవోగా వ్యవహరించిన తెలుగుతేజం సత్య నాదెళ్ల తాజాగా చైర్మన్ గా నియమితులయ్యారు. దీనిపై, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా కొత్త బాధ్యతలు అందుకుంటున్న సత్య నాదెళ్లకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇది ఎంతో గర్వించదగిన సమయం అని పేర్కొన్నారు.
ఇక లోకేశ్ స్పందిస్తూ, మైక్రోసాఫ్ట్ సంస్థకు చైర్మన్ గా సత్య నాదెళ్ల నియమితులయ్యారన్న విషయం వినడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. సత్య నాదెళ్ల సాధించిన ఘనతలతో ప్రతి తెలుగువాడు గర్వపడతాడని కొనియాడారు. ఈ కొత్త పాత్రలో ఆయన మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్టు శుభకాంక్షలు తెలిపారు.