ఆల్ఫా, డెల్టా... ఇప్పుడు లాంబ్డా వంతు?.. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా గుర్తించిన డబ్ల్యూహెచ్‌ఓ
- తొలుత పెరూలో గుర్తించిన నిపుణులు
- ఇప్పటికే 29 దేశాలకు వ్యాప్తి
- లాటిన్ అమెరికా దేశాలపై ప్రభావం
- పెరూలో 81 శాతం కేసుల్లో లాంబ్డా వేరియంటే
- మ్యూటేషన్లూ ఎక్కువే
ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌తో ఆందోళనకు గురవుతున్న ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ మరో చేదు వార్తను తెలియజేసింది. మరో కొత్త వేరియంట్‌ను 29 దేశాల్లో గుర్తించినట్లు వెల్లడించింది. పెరూలో తొలుత గుర్తించిన ఈ రకానికి లాంబ్డాగా నామకరణం చేశారు. ప్రస్తుతానికి దీన్ని అధ్యయనాసక్తి గల వేరియంట్ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్)గా గుర్తించారు. దీని వల్ల ఎంత మేర ప్రమాదం పొంచి ఉందన్న దానిపై అధ్యయనం జరగాల్సి ఉంది.
తొలుత ఈ వేరియంట్‌ను ఆగస్టు 2020లో పెరూలో గుర్తించారు. ఇప్పటి వరకు 29 దేశాలకు ఇది పాకి పోయింది. ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్ అమెరికా దేశాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. ఏప్రిల్ నాటికి పెరూలో వెలుగులోకి వచ్చిన మొత్తం కేసుల్లో 81 శాతం లాంబ్డా వేరియంట్‌కు సంబధించినవే కావడం గమనార్హం. ఇక చిలీలో జన్యుక్రమ విశ్లేషణ జరిపిన నమూనాల్లో 61 శాతం వాటిల్లో కొత్త వేరియంట్ ఆనవాళ్లను గుర్తించారు.
దీని వ్యాప్తి కొన్ని దేశాల్లో ఆందోళనకర స్థాయిలోనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పెరూ, చిలీ, ఈక్వెడార్, అర్జెంటినాలో వైరస్ ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఈ వేరియంట్‌లో మ్యూటేషన్లు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ వైరస్ స్పైక్ ప్రోటీన్లలో అనేక రూపాంతరాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.