కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన జస్టిస్ జమాల్ నియమాకం

  • జస్టిస్ జమాల్‌ను నామినేట్ చేసిన ప్రధాని ట్రుడో
  • తొలి శ్వేతజాతేతర వ్యక్తిగా రికార్డ్
  • సుప్రీంకోర్టుకు ఆయన గొప్ప ఆస్తిగా మారతారన్న ప్రధాని
భారత సంతతికి చెందిన జస్టిస్ మహ్మద్ జమాల్‌కు కెనడాలో అరుదైన గౌరవం లభించింది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో గురువారం ఆయనను సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ట్రుడో మాట్లాడుతూ.. లీగల్, అకడమిక్ రంగాల్లో జమాల్‌కు అపార అనుభవం ఉందన్నారు. సుప్రీంకోర్టుకు ఆయన గొప్ప ఆస్తిగా మారతారని అన్నారు. కాగా, సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన తొలి శ్వేతజాతేతర వ్యక్తిగా జమాల్ రికార్డులకెక్కారు. జమాల్ 2019లో కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఫర్ ఒంటారియోలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


More Telugu News