వివేకా హత్య కేసు: 14వ రోజూ కొనసాగుతున్న సీబీఐ విచారణ

  • 8 మంది అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు
  • కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణ
  • మూడు రోజులు ప్రధాన అనుచరుడిపై ప్రశ్నల వర్షం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 8 మంది అనుమానితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ లో వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో 14 రోజులుగా సీబీఐ విచారణ నడుస్తోంది.

మూడు రోజులుగా వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్రం గంగిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఆయనతో పాటు పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి చెందిన అశోక్ కుమార్, ఓబులపతి నాయుడు, రాఘవేంద్ర, పులివెందులకే చెందిన శ్రీరాములు, హరినాథరెడ్డి, కృష్ణ–సావిత్రి దంపతులను విచారణకు పిలిచారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందు ఆయన కాల్ డేటా ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే వివేకా కారు డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లా, వివేకాకు సన్నిహితంగా ఉండే కిరణ్ కుమార్ యాదవ్, సునీల్ కుమార్ యాదవ్ సహా మరికొంతమందిని సీబీఐ అధికారులు విచారించారు.


More Telugu News