వారాన్ని లాభాలతో ముగించిన మార్కెట్లు

  • 226 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 70 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతానికి పైగా లాభపడ్డ టాటా స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటం మార్కెట్లపై పాజిటివ్ ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 52,925కి పెరిగింది. నిఫ్టీ 70 పాయింట్లు పుంజుకుని 15,860 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.68%), యాక్సిస్ బ్యాంక్ (2.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.78%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.34%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.34%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.67%), ఎన్టీపీసీ (-1.48%), టైటాన్ కంపెనీ (-1.35%), ఏసియన్ పెయింట్స్ (-1.15%).


More Telugu News