ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో ఉండాలి: సీఎం జగన్

  • వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష
  • ఆసుపత్రుల్లో వసతులపై శ్రద్ధ చూపాలని సూచన
  • రోగులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని స్పష్టీకరణ
  • కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని వెల్లడి
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఔషధాలు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఆసుపత్రి భవనాలు, వైద్య పరికరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ ఉండాలని, అందుకోసం ప్రత్యేకంగా మానిటరింగ్ అధికారి ఉండాలని సూచించారు.

ఇక, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీఎం జగన్ స్పందిస్తూ... ఏపీలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 5.23 శాతంగా ఉందని తెలిపారు. యాక్టివ్ కేసులు కూడా 50 వేల దిగువకు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.67 శాతం అని, అది జాతీయస్థాయి రికవరీ రేటు (96.59 శాతం) కంటే ఎక్కువ అని పేర్కొన్నారు.


More Telugu News