హేమంత్ కర్కరేపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
- మాలేగావ్ పేలుడు కేసులో నాపై తప్పుడు కేసులు పెట్టారు
- తప్పుడు సాక్ష్యాలను సేకరించారు
- దేశభక్తులెవరూ ఆయనను దేశభక్తుడు అని పిలవరు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై ఆమె మరోసారి విరుచుకుపడ్డారు. తనపై తప్పుడు కేసులు పెట్టాడని, తప్పుడు సాక్ష్యాలను సేకరించాడని మండిపడ్డారు.
తన నియోజకవర్గం భోపాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2008 మాలేగావ్ పేలుడు కేసులో తనను అరెస్ట్ చేశారని.. అప్పుడు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. హేమంత్ కర్కరేను జనాలు దేశభక్తుడు అంటారని... కానీ, నిజమైన దేశభక్తులు ఆయనను దేశభక్తుడు అని పిలవరని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని దుయ్యబట్టారు.