లాభాల్లో ప్రారంభమై.. చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఆసియా దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఆచితూచి అడుగులు వేసిన ఇన్వెస్టర్లు
  • 189 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈ ఉదయం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. అయితే, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్లు మళ్లీ కోలుకోలేదు.

ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేశారు. ముఖ్యంగా హెవీ వెయిట్ కంపెనీలు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థల షేర్లు కుంగడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు పతనమై 52,735కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 15,814 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.75%), టాటా స్టీల్ (1.64%), టెక్ మహీంద్రా (1.43%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.60%), సన్ ఫార్మా (0.60%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-1.56%), టీసీఎస్ (-1.33%), హెచ్సీఎల్ (-1.00%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.87%).


More Telugu News