ఇక నుంచి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- రేవంత్ కు పీసీసీ పదవి
- తీవ్ర నిరాశకు గురైన కోమటిరెడ్డి
- తీవ్రస్థాయిలో నిరసన గళం
- తాజాగా మరోసారి స్పందించిన వైనం
- తనను రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టీకరణ
రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత బాహాటంగా వినిపించిన తొలి నిరసన గళం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదే. పీసీసీ అధ్యక్ష పదవికి కోసం చివరివరకు ఆశించిన ఆయన... ఆ అవకాశం రేవంత్ రెడ్డికి దక్కడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇక గాంధీభవన్ మెట్లెక్కను గాక ఎక్కను అంటూ శపథం చేసిన ఆయన తాజాగా మరోసారి తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. ఇకమీదట రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.
ప్రజాసమస్యలపై మాత్రం ఏ సమయంలో వచ్చినా స్పందిస్తానని, రాజకీయాల్లోకి మాత్రం తనను లాగొద్దని పేర్కొన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామానికి వెళతానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.