వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 66 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 26 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఒకటిన్నర శాతం నష్టపోయిన బజాజ్ ఫిన్ సర్వ్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు ఐటీ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. అయితే బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు కోల్పోయి 52,482కి పడిపోయింది. నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 15,721 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (1.19%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.14%), నెస్లే ఇండియా (0.85%), మారుతి సుజుకి (0.74%), టెక్ మహీంద్రా (0.73%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.55%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.46%), ఎన్టీపీసీ (-1.02%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.96%).


More Telugu News