తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు
- ఈ నెల 8 వరకు దరఖాస్తుల స్వీకరణ
- విద్యార్థుల విన్నపం మేరకే నిర్ణయం తీసుకున్నామన్న ఎంసెట్ కన్వీనర్
- ఆగస్టు నెలలో జరగనున్న ఎంసెట్ పరీక్షలు
కరోనా కారణంగా ఎన్నో పరీక్షలు రద్దవుతున్నాయి. మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తెలంగాణలో కూడా అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్ట్ నెలలో తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో, విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ నిర్వహణ తేదీలు ఇవే:
ఎంసెట్ ఇంజినీరింగ్ - ఆగస్టు 4, 5, 6
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ - ఆగస్టు 9, 10
మరోవైపు పీజీ ఈసెట్ పరీక్షలు ఆగస్టు 11 నుంచి 14 వరకు జరగనున్నాయి. ఐసెట్ పరీక్షలు ఆగస్టు 19, 20 తేదీల్లో కొనసాగనున్నాయి. ఎడ్ సెట్ ఆగస్ట్ 24, 25 తేదీల్లో... లాసెట్ ఆగస్టు 23న పాలిసెట్ జులై 17న జరగనున్నాయి. ఈ సెట్ - ఆగస్టు 3న జరగనుంది.