వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన‌సాగుతోన్న‌ సీబీఐ విచార‌ణ‌

  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 26వ రోజు విచార‌ణ
  • అలంఖాన్ పల్లెకు చెందిన వ్యాపారి, టీడీపీ నేత లక్ష్మిరెడ్డి హాజ‌రు
  • పులివెందులలోనూ సీబీఐ ద‌ర్యాప్తు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 26వ రోజు విచార‌ణ కొనసాగిస్తోంది. మ‌రోవైపు, పులివెందులలోనూ సీబీఐ అధికారులు ప‌లు వివ‌రాలు రాబ‌డుతున్నారు. ఈ రోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారణకు కడప అలంఖాన్ పల్లెకు చెందిన వ్యాపారి, టీడీపీ నేత లక్ష్మిరెడ్డి హాజరయ్యారు.

వివేక హ‌త్య కేసులో ప‌లు అంశాల‌పై ఆయ‌న నుంచి అధికారులు ప‌లు వివ‌రాలు రాబ‌డుతున్నారు. ఇప్ప‌టికే సీబీ అధికారులు వివేక మాజీ డ్రైవర్ దస్తగిరిని, కేసులో కీల‌కంగా భావిస్తోన్న‌ వైఎస్‌ వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, కడపకు చెందిన రవిశంకర్‌, పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులు, వారి కుమారులు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆధారాలు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.


More Telugu News