తిరుమల భక్తుల సర్వదర్శనంపై టీటీడీ శుభవార్త!
- త్వరలోనే టికెట్ల జారీ
- కరోనా పాజిటివిటీ రేటు తగ్గిన తరువాతే
- కాటేజీల ఆధునికీకరణ పనులు వేగవంతం
- వెల్లడించిన జవహర్ రెడ్డి
అతి త్వరలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సర్వదర్శనం టికెట్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జవహర్ రెడ్డి వెల్లడించారు. అయితే, సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలంటే, కరోనా అదుపులోకి రావాల్సి ఉంటుందని అన్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం కన్నా దిగువకు వస్తే దర్శన టికెట్లను పెంచుతామని అన్నారు.
గత సంవత్సరం కరోనా తగ్గిన తరువాత సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తే, భారీ ఎత్తున భక్తులు గుంపులుగా చేరారని గుర్తు చేసిన ఆయన, ఈ దఫా ఆ పరిస్థితి లేకుండా చూస్తామన్నారు. తిరుమలలో కాటేజీల ఆధునికీకరణ పనులు వేగం చేశామని, త్వరలోనే వీటిని భక్తులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.