ఈ తరహా పెట్టుబడులు దక్షిణాసియాలోనే మొదటిసారి: మంత్రి కేటీఆర్​

  • జీనోమ్ వ్యాలీలో కెనడా సంస్థ పెట్టుబడులు
  • పెన్షన్ ఫండ్ తో ఏర్పాటు చేస్తారన్న కేటీఆర్
  • రూ.747 కోట్ల పెట్టుబడి అని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కెనడాకు చెందిన ఇవన్హో కేంబ్రిడ్జి అనే సంస్థ పెట్టుబడులు పెట్టనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.747 కోట్లు) జీనోమ్ వ్యాలీలో ఎంఎన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పది లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో సంస్థను ఏర్పాటు చేస్తారన్నారు.

లైఫ్ సైన్సెస్  రియల్ ఎస్టేట్ రంగంలో పెన్షన్ ఫండ్ తో ఈ తరహా పెట్టుబడులు దక్షిణాసియాలోనే ఇది మొదటిసారని ఆయన అన్నారు. దేశంలో లైఫ్ సైన్సెస్ రంగానికి బెంచ్ మార్క్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పెట్టుబడులు రావడం వల్ల లైఫ్ సైన్సెస్ రంగంలో లీడర్ గా ఉన్న హైదరాబాద్ మరింత ముందుకు పోతుందని తెలిపారు. 


More Telugu News