తెలంగాణ ప్రజాప్రతినిధులు చేసుకుంటోన్న విజ్ఞప్తులను మేము తిరస్కరిస్తున్నట్లు దుష్ప్రచారం: టీటీడీ
- అందులో నిజం లేదు
- వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారు
- వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువ ఉంది
- రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాం
తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు చేసుకుంటోన్న విజ్ఞప్తులను తాము తిరస్కరించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తాము సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. గతంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏ విధానపరమైన నిబంధనలు అమలు జరిగేవో ఇప్పుడు కూడా వాటినే కొనసాగిస్తున్నామని తెలిపింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారని చెప్పింది.
అయితే, వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండడంతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు అధికంగా రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను మాత్రమే తిరస్కరించామని పేర్కొంది. చివరకు, తమకు కొందరు ఫోన్ చేసి విజ్ఞప్తులు చేసుకోవడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంజూరు చేసి శ్రీవారి దర్శనం చేయించామని తెలిపింది. గదులకు సంబంధించి కూడా వారికి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పింది.