భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 397 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 120 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.74 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ లాభాల్లోకి మళ్లాయి. చివరి వరకు మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండటం మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది.
బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకుల కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం కూడా మార్కెట్లు లాభాల్లో పయనించేందుకు దోహదపడింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు లాభపడి 52,770కి చేరుకుంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 15,812కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.74%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.67%), యాక్సిస్ బ్యాంక్ (2.26%), సన్ ఫార్మా (2.12%), ఎన్టీపీసీ (1.57%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.92%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.90%), టెక్ మహీంద్రా (-0.57%), మారుతి సుజుకి (-0.54%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.28%).