255 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 70 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- మార్కెట్లను నడిపించిన ఐటీ, బ్యాంకింగ్ స్టాకులు
- 5 శాతానికి పైగా లాభపడిన హెచ్సీఎల్ షేరు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 53,159కి చేరుకుంది. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 15,924 వద్ద స్థిరపడింది. ఈరోజు మార్కెట్లు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (5.10%), ఎల్ అండ్ టీ (4.19%), టెక్ మహీంద్రా (2.93%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.48%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.15%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.84%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.78%), ఏసియన్ పెయింట్స్ (-0.64%), టైటాన్ కంపెనీ (-0.51%), సన్ పార్మా (-0.42%).