ఈ నెల 25న భూమికి సమీపానికి రానున్న భారీ గ్రహశకలం

  • ఫుట్ బాల్ స్టేడియం కంటే పెద్దదైన గ్రహశకలం
  • 2008 జివో 20గా నామకరణం
  • ఇది భూమిని తాకే అవకాశాలు లేవన్న నాసా
  • ఎవరూ ఆందోళన చెందరాదని వెల్లడి
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ఓ గ్రహశకలం దూసుకొస్తోందని వెల్లడించింది. ఈ నెల 25న ఇది భూమికి సమీపం నుంచి వెళుతుందని వివరించింది. ఇది భూమిని దాటి వెళ్లే సమయంలో రెండింటి మధ్య దూరం 37,18,232 మైళ్లు ఉంటుందని పేర్కొంది. ఇది భూమిని తాకే అవకాశాలు మాత్రం లేవని, ప్రమాదమేమీ ఉండదని తెలిపింది.

కాగా ఈ గ్రహశకలానికి నాసా 2008 జివో 20 అని నామకరణం చేసింది. దీని వేగం గంటకు 18 వేల మైళ్లు. ఇది ఓ ఫుట్ బాల్ స్టేడియం కంటే పెద్దదిగా ఉంటుందట. కాగా, ప్రస్తుతం విశ్వంలో 10 లక్షలకు పైగా గ్రహశకలాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇవి సౌరవ్యవస్థ ఆవిర్భావం కాలం నాటివి.


More Telugu News