కృష్ణా జలాల అంశంలో ప్రధాని మోదీకి లేఖ రాసిన నాగం జనార్దన్ రెడ్డి
- తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపిన కృష్ణా జలాలు
- ప్రధాని, జల్ శక్తి మంత్రి స్పందించాలన్న నాగం
- కృష్ణా నీళ్లు దోచుకుపోతున్నారని ఆరోపణ
- ఏపీ మంత్రులపైనా వ్యాఖ్యలు
కృష్ణా జలాల అంశం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రూపుదాల్చిన నేపథ్యంలో తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కృష్ణా జలాల అంశంలో ప్రధాని, కేంద్ర జల్ శక్తి మంత్రి స్పందించాలని కోరారు.
కృష్ణా జలాలను వాడుకునే హక్కు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలకే ఉంటుందని స్పష్టం చేశారు. కానీ రాయలసీమకు కృష్ణా నీళ్లు దోచుకుపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక రాయలసీమకు నీళ్ల దోపిడీ మరింత ఎక్కువైందని తెలిపారు. ఏపీ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ మంత్రులు బానిసల్లా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ కొంప ముంచేది ప్రాజెక్టుల రీడిజైనింగేనని నాగం జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.