సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పూజ హెగ్డేకు నచ్చిన ప్రేమకథ 
  • పాటలకు రెడీ అవుతున్న రవితేజ
  • ఓటీటీ కోసం నాగ చైతన్య సినిమా  
*  తన కోరిక 'రాధేశ్యామ్' సినిమాతో తీరిందంటోంది కథానాయిక పూజ హెగ్డే. 'ఇంతవరకు నేను పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించలేదు. ఇన్నాళ్లూ అలాంటి అవకాశం కోసం ఎదురుచూశాను. అది రాధేశ్యామ్ తో నెరవేరింది. మనసుకి సంతృప్తినిచ్చిన ప్రేమకథా చిత్రమిది' అని చెప్పింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణం ముగింపు దశలో వుంది.
*  రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రానికి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారం నుంచి జరుగుతుంది. మొదట్లో ఈ పాటలను దుబాయ్ లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే, వీసా సమస్యల వల్ల ఆ ఆలోచనను విరమించుకుని, హైదరాబాదులోనే సెట్స్ లో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓటీటీ కోసం ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనిని శరత్ మరార్ నిర్మిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది. త్వరలోనే దర్శకుడిని ఎంపిక చేస్తారు. ఇదిలా ఉంచితే, చైతూ ప్రస్తుతం తెలుగులో 'థ్యాంక్యూ', 'బంగార్రాజు' సినిమాలతో పాటు హిందీలో 'లాల్ సింగ్ చద్దా' చిత్రాన్ని చేస్తున్నాడు.


More Telugu News