నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. భారీగా నష్టపోయిన డాక్టర్ రెడ్డీస్ షేర్
- 273 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 78 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 10.44 శాతం పతనమైన డాక్టర్ రెడ్డీస్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు అనంతరం ఒడిదుడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 273 పాయింట్లు నష్టపోయి 52,578కి పడిపోయింది. నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 15,746 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.50%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.45%), బజాజ్ ఫైనాన్స్ (1.05%), నెస్లే ఇండియా (0.89%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-10.44%),యాక్సిస్ బ్యాంక్ (-3.23%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.44%), సన్ ఫార్మా (-2.21%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.19%).