నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 135 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 37 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా లాభపడ్డ భారతి ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 52,443కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (5.01%), టాటా స్టీల్ (2.89%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.73%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.34%), ఐసీఐసీఐ (1.23%).

టాప్ లూజర్స్: కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.56%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.53%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.85%), ఎన్టీపీసీ (-1.73%).


More Telugu News