పొలం దున్నుతుండగా బయటపడిన భారీ గణపతి విగ్రహం
- సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ఘటన
- ట్రాక్టరుతో పొలం దున్నిస్తుండగా నాగలికి తాకి బయటపడిన వైనం
- చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఓ పొలం నుంచి విఘ్నేశ్వరుడి భారీ విగ్రహం ఒకటి బయటపడింది. జిల్లాలోని నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు పంట సాగు కోసం నిన్న సాయంత్రం ట్రాక్టర్‌తో పొలం దున్నించారు.
ఈ క్రమంలో ట్రాక్టర్ నాగలికి తగిలి గణేశుడి విగ్రహంతోపాటు దానిని ప్రతిష్ఠించే భారీ పీఠం బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్థులు విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.