నాగార్జున సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశించారు: మంత్రి జగదీశ్ రెడ్డి
- ఏఎంఆర్పీ నుంచి నీటి విడుదలకు కేసీఆర్ ఆదేశాలు
- అధికారుల ఏర్పాటు
- నాగార్జునసాగర్ జలాశయానికి పెరిగిన వరద
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎనిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) నుంచి నీటి విడుదలకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని వివరించారు. దీంతో అధికారులు దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు.
మరోవైపు, నాగార్జునసాగర్ జలాశయానికి వరద మరింత పెరుగుతోంది. జలాశయంలోని 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గాను ఇప్పటికే 579.20 అడుగుల మేర నీరు చేరింది. 312.04 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నెస్పీ అధికారులు జలాశయం క్రస్ట్ గేట్లను పరిశీలించారు.