ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు... 364 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- వారాన్ని లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు
- 122 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- 3.44 పెరిగిన టైటాన్ కంపెనీ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ తదితర హెవీ వెయిట్ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ కావడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 52,950కి పెరిగింది. నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకుని 15,885కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (3.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.97%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.77%), యాక్సిస్ బ్యాంక్ (1.69%), మారుతి సుజుకి (1.38%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.66%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.68%), బజాజ్ ఫైనాన్స్ (-0.48%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.23%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.21%).