భారీ లాభాల్లో మార్కెట్లు.. తొలిసారి 16 వేల మార్కును దాటిన నిఫ్టీ

  • జులై నెలలో 33 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
  • 873 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 246 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 16 వేల మార్కును అధిగమించింది. జులై నెలలో జీఎస్టీ వసూళ్లు 33 శాతం పెరిగి రూ. 1.16 లక్షల కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 873 పాయింట్లు లాభపడి 53,823కి పెరిగింది. నిఫ్టీ 246 పాయింట్లు పుంజుకుని 16,131 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (4.16%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.72%), నెస్లే ఇండియా (3.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.36%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.47%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-0.30%), బజాజ్ ఆటో (-0.23%), టాటా స్టీల్ (-0.15%).


More Telugu News