ఆ బోర్డులు చూసైనా చంద్ర‌బాబు గారిపై ఏడుపు ఆపండి: నారా లోకేశ్

  • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేశాయి  
  •  దక్షిణాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయి
  • త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ బంకుల్లో బోర్డులు చూడండి 
ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పెంచిన ప‌న్నుల‌తో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేసి, దక్షిణాదిలోనే అతి ఎక్కువ‌గా ఉంటే, చంద్ర‌బాబు గారిపై ఏడుపా? అని లోకేశ్ ప్రశ్నించారు.

 ఇంధ‌న‌ ధ‌ర‌ల భారం ప్రజలపై పడకూడదని 2018లో పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్ ని రూ. 4 నుంచి రూ. 2కి తగ్గించిన ఘనత చంద్రబాబుదైతే... దేశంలో ఎక్కడా లేనివిధంగా 31 శాతం వ్యాట్ లీటరుకి రూ.4 అదనపు వ్యాట్ లీటరుకి 1 రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకం వేసి... లీటర్ పెట్రోల్ కి రూ.30 భారం సామాన్యులపై మోపిన ద‌రిద్ర చ‌రిత్ర జ‌గ‌న్‌రెడ్డిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆత్మలతో మాట్లాడుతున్న లండ‌న్ పిచ్చిరెడ్డి గారి పిచ్చి ఏమైనా అంటుకుందా సజ్జలా... బాబుగారి జ‌పం చేస్తున్నావు? అని లోకేశ్ ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మీ పాల‌న‌లో ఏ రేంజులో ఉన్నాయో తెలుసుకోవాలంటే స‌రిహ‌ద్దులోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ బంకుల్లో బోర్డులు చూడాలని సూచించారు. ఏపీ కంటే త‌క్కువ ధ‌ర‌ల‌నే బోర్డులు చూసైనా చంద్ర‌బాబు గారిపై ఏడుపు ఆపాలని హితవు పలికారు.


More Telugu News