కడప జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • అనంతపురం నుంచి టమాటా లోడుతో వెళ్తున్న లారీ
  • కర్ణాటక వైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టిన వైనం
  • తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
కడప జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరు-బద్వేలు రహదారిపై బ్రహ్మంగారిమఠం మండలం డి.అగ్రహారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి టమాటా లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న లారీ, కర్ణాటక వైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది.

ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సద్దాం, రేష్మతోపాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సల్మా బద్వేలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయపడిన మరో ముగ్గురు కడప సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News