ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 125 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 20 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ ఎం అండ్ ఎం షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఆటో సూచీల అండతో మళ్లీ కోలుకుని లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 54,403కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 16,258 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.07%), భారతి ఎయిర్ టెల్ (1.61%), టాటా స్టీల్ (1.33%), ఎల్ అండ్ టీ (0.79%), బజాజ్ ఫైనాన్స్ (0.68%), ఎన్టీపీసీ (0.64%).
 
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-1.83%), టెక్ మహీంద్రా (-1.77%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.36%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.85%).


More Telugu News