రియల్టర్ విజయభాస్కర్ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం... పరారీలో త్రిలోక్ నాథ్ బాబా

  • సంచలనం రేపిన రియల్టర్ హత్య
  • కిడ్నాప్ చేసి, అంతమొందించిన దుండగులు
  • శ్రీశైలం సమీపంలో దహనం
  • నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇటీవల సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయభాస్కర్ హత్యోదంతంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నెల్లూరుకు చెందిన విజయభాస్కర్ రెడ్డిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు. ఆపై శ్రీశైలం వద్ద సున్నిపెంట శ్మశాన వాటికలో దహనం చేశారు. విజయభాస్కర్ రెడ్డి అల్లుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

కాగా, ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న స్వామీజీ త్రిలోక్ నాథ్ బాబా పరారీలో ఉన్నట్టు గుర్తించారు. అతడి వెంట మరో నిందితుడు కార్తీక్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిద్దరూ కేరళ పారిపోయినట్టు తెలుస్తోందని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఈ హత్య కేసులో ఇతరుల పాత్రపైనా విచారణ కొనసాగుతుందని తెలిపారు. రాజకీయ నేతలు, ప్రముఖుల పాత్రపైనా విచారిస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో తాము అరెస్ట్ చేసిన నలుగురు నిందితుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి నిచ్చిందని, రేపు ఉదయం వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని తెలిపారు.


More Telugu News