చివర్లో ఒత్తిడికి గురైనా.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 152 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 22 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం వరకు లాభపడిన భారతి ఎయిర్ టెల్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 54,780 పాయింట్లను తాకింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. చివరకు సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 54,555 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 16,280 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.84%), టెక్ మహీంద్రా (2.81%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.85%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.48%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.73%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.21%), ఎన్టీపీసీ (-2.14%), ఐటీసీ (-1.85%), బజాజ్ ఆటో (-1.64%).