కరోనా లీక్ సిద్ధాంతాన్ని విరమించుకోవాలని విచారణ సమయంలో ఒత్తిడి తెచ్చారు: డబ్ల్యూహెచ్ఓ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు
- కొన్ని నెలల క్రితం చైనాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పర్యటన
- కరోనా మూలాలపై పరిశోధనలు
- ల్యాబ్ నుంచి లీక్ కాలేదని అప్పట్లో చెప్పిన నిపుణులు
- ఇప్పుడు మాట మార్చిన వైనం
- ఆ ల్యాబ్‌పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయన్న నిపుణుడు పీటర్
కరోనా లీక్ సిద్ధాంతాన్ని విరమించుకోవాలని విచారణ సమయంలో ఒత్తిడి తెచ్చారంటూ డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు పీటర్ బెన్ ఎంబరెక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మూలాలను కనిపెట్టడానికి కొన్ని నెలల క్రితం చైనాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పర్యటించిన విషయం తెలిసిందే.
ఆ బృందంలో పీటర్ కూడా ఉన్నారు. అప్పట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా ఆయన మాట్లాడడం గమనార్హం. తాజాగా, తమ పరిశోధనల విషయంపై ఆయన స్పందిస్తూ... వూహాన్‌లోని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ల్యాబ్‌లో కొవిడ్ వైరస్‌ను ఉంచారని ఆయన చెప్పారు.
అయితే, ఆ ల్యాబ్ భద్రతా ప్రమాణాలు ఆ వైరస్ ను కట్టడి చేసే స్థాయిలో లేవని, చైనా అధికారులు తమపై ఒత్తిడి తీసుకొచ్చి వైరస్ మూలాలపై విచారణ సమయంలో లీక్ సిద్ధాంతాన్ని విరమించుకోవాలని చెప్పారని అన్నారు. ఆ ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై అప్పట్లోనే తమకు అనుమానాలు వచ్చాయని తెలిపారు.
కాగా, వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా లీక్ కాలేదంటూ కొన్ని నెలల క్రితం డబ్ల్యూహెచ్ఓ బృందం నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ ల్యాబ్‌పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని పీటర్ చెప్పారు. తొలుత, గబ్బిలాల నుంచి శాంపిళ్లు తీస్తున్న ల్యాబ్ వర్కర్‌కు వైరస్ సోకి ఉండొచ్చని గతంలోనూ పీటర్ చెప్పారు. పీటర్ బెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చైనా ల్యాబ్‌పై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆ ల్యాబ్‌పై స్వతంత్ర పరిశోధన జరపాలని డిమాండ్ వస్తోంది.