లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 162 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 45 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటి వరకు స్థిరంగా కొనసాగినప్పటికీ... ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 55,629కి చేరింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 16,568 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.46%), బజాజ్ ఫైనాన్స్ (2.12%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.78%), నెస్లే ఇండియా (0.91%), బజాజ్ ఆటో (0.89%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.80%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.11%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.06%), యాక్సిస్ బ్యాంక్ (-0.74%).


More Telugu News