దేశంలో రెండు నెల‌ల్లో తార‌స్థాయికి క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ‌: నిపుణుల క‌మిటీ నివేదిక‌

  • పీఎంవోకి వివ‌రాలు తెలిపిన‌ జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ
  • ప్ర‌స్తుతం ఉన్న వైద్య స‌దుపాయాలు ఏ మాత్రం స‌రిపోవ‌ని హెచ్చ‌రిక‌
  • వైద్యులు, ఇత‌ర వైద్య సిబ్బందిని పెంచాల‌ని సూచ‌న‌
క‌రోనా మూడో ద‌శపై కేంద్ర ప్ర‌భుత్వానికి జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ నివేదిక ఇచ్చి ప‌లు హెచ్చ‌రిక‌లు చేసింది. భార‌త్‌లో క‌రోనా మూడో ద‌శ ముప్పు స‌మీపంలోనే ఉంద‌ని తెలిపింది. అక్టోబ‌రులో ఈ విజృంభ‌ణ తార‌స్థాయికి చేరుకునే ప్ర‌మాదం ఉంద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు నిపుణుల క‌మిటీ నివేదిక‌ను జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యానికి స‌మ‌ర్పించింది.

క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ వ‌స్తే ప్ర‌స్తుతం ఉన్న వైద్య స‌దుపాయాలు ఏ మాత్రం స‌రిపోవ‌ని హెచ్చ‌రించింది. చిన్న పిల్ల‌ల‌కు వైద్యం కోసం వైద్యులు, ఇత‌ర వైద్య సిబ్బందిని పెంచాల‌ని చెప్పింది. వెంటిలేట‌ర్లు, అంబులెన్సుల సంఖ్య‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పింది.


More Telugu News