ఎన్ఎంపీ ఎఫెక్ట్... భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 467 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 128 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 8 శాతం వరకు లాభపడ్డ బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ షేర్లు లాభాలను ముందుండి నడిపించాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 467 పాయింట్లు లాభపడింది.

నేషనల్ మానెటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపీ)ను కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 55,959కి చేరుకుంది. నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 16,625 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (7.91%), బజాజ్ ఫైనాన్స్ (3.33%), టాటా స్టీల్ (3.39%), టెక్ మహీంద్రా (3.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.31%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.34%), ఇన్ఫోసిస్ (-1.06%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.97%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.92%), ఏసియన్ పెయింట్స్ (-0.87%).


More Telugu News