బాలీవుడ్ దర్శకుడి కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్?
- పలు సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీ
- ఇప్పటికే పూర్తయిన 'రాధేశ్యామ్'
- సెట్స్ పై 'సలార్', 'ఆదిపురుష్'
- సిద్ధార్థ్ ఆనంద్ స్క్రిప్టుకు ఓకే
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్ ఇప్పుడు పలు సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రాన్ని పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇది నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మరోపక్క ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
అలాగే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇంకోపక్క, 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా హైదరాబాదులో మొదలైంది. ఈ క్రమంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రానికి ఓకే చెప్పాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ఇంతకుముందే ఓకే చెప్పాడు.
తాజాగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హీరో ప్రభాస్ ను కలసి కథ చెప్పాడనీ, అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ సమాచారం. ఇది యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. దీనిని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడుతుంది.